ఇండియా అండర్-19 మరియు దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన కెరీర్లో మరో మైలురాయిని అందుకున్నాడు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో ఒక జట్టుకు నాయకత్వం వహించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో సౌరాష్ట్రతో జరిగిన 2026-27 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లో బిహార్ జట్టుకు అతడు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్ జరిగే నాటికి వైభవ్ వయస్సు కేవలం 15 సంవత్సరాల 232 రోజులు మాత్రమే కావడం విశేషం.