ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన మైక్రోసాఫ్ట్ సేవలు సుమారు 36 గంటల విరామం తర్వాత పూర్తిగా పునరుద్ధరించబడ్డాయి. ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, కోపైలట్‌తో పాటు మైక్రోసాఫ్ట్ 365 ప్లాట్‌ఫామ్‌కు చెందిన ఇతర సేవలు యథావిధిగా పనిచేస్తున్నట్లు ఆ సంస్థ శనివారం అధికారికంగా ప్రకటించింది. టెక్నికల్ సమస్యలను పూర్తిగా పరిష్కరించినట్లు పేర్కొన్నప్పటికీ, సిస్టమ్స్ పనితీరు మరియు ఈమెయిల్స్ డెలివరీని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేసింది.