అమెరికాలోని మిసిసిపి నదిలో పెను ప్రమాదం తప్పింది. న్యూ ఓర్లీన్స్ పోర్టు వద్ద ఆగి ఉన్న ఐదు అంతస్తుల ‘అమెరికన్ హెరిటేజ్ క్రూజ్ నౌకను ‘అట్లాంటిక్ ఆస్ఫాల్ట్’ అనే భారీ ట్యాంకర్ ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి నౌక అద్దాలు, లోహపు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. క్షణాల్లోనే నౌకలోకి నీరు చేరడంతో ఒకవైపు ఒరిగిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులు, సిబ్బంది ప్రాణభయంతో నదిలోకి దూకారు. డజన్ల కొద్దీ ప్రయాణికులను నదిలో నుంచి సమీప నౌకల్లోకి లాగి రక్షించారు. సుమారు 32 మంది గాయపడ్డారు.