అమెరికా ఏవియేషన్ ఇండస్ట్రీలో అతిపెద్ద సమస్య తలెత్తింది. అమెరికన్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) పిలుపు మేరకు దేశంలోని అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. అమెరికా అంతటా ఎయిర్‌పోర్టులలో ఫ్లైట్లను గ్రౌండ్ చేశారు.ఎయిర్ కంట్రోల్ సెంటర్లలో కమ్యూనికేషన్ సమస్య వల్ల విమానాలు నిలిపివేశారు. ఈ సమస్య నెట్వర్క్ రౌటర్లో వచ్చిన లోపంతో మొదలైందని.తదుపరి సమాచారం వచ్చేవరకు దేశంలో అన్ని ఫ్లైట్లపై నిషేధం విధించినట్లు ఎఫ్ఏఏ తెలిపింది.