విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండు రోజుల్లో మొత్తం 9 లక్షల 89వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వీటి ద్వారా 3లక్షల 48 వేల 309 ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు వెల్లడించారు. 2024 జూన్ నుంచి మొత్తం ఎంవోయూల విలువ 32.49 లక్షల కోట్లకు చేరిందన్న ఆయన దేశ చరిత్రలోనే ఇది రికార్డు అని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.

