దేశవ్యాప్తంగా ఘనంగా బాలల దినోత్సవం (నవంబర్ 14) జరుపుకుంటున్నవేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రీయ భవన్ కల్చరల్ సెంటర్లో వివిధ పాఠశాలలు, సంస్థలకు చెందిన విద్యార్థులతో మమేకమయ్యారు. పిల్లలను ఆప్యాయంగా పలకరించిన ఆమె.. విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునేందుకు అంకితభావం, నిబద్ధత, కృషితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ దేశంలోని యువతకు శుభాకాంక్షలు తెలిపారు.