ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, సాయంత్రానికి దక్షిణ మధ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. దీని ప్రభావంతో ఈ నెల 18, 19 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ 18న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.