ప్రముఖ నటుడు గిరిబాబు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం రావినూతలలో బంధు, మిత్రుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రకాశం జిల్లా రావినూతలలోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర సాగింది. గ్రామస్థులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నటుడు రఘుబాబు తన తండ్రి చితికి తలకొరివి పెట్టడంతో గిరిబాబు అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుముందు పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.