జేమ్స్ బాండ్‌గా కొత్త హీరో ఎంట్రీ..
ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. ప్రఖ్యాత స్పై థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘జేమ్స్ బాండ్ 007’తదుపరి హీరోగా హాలీవుడ్ స్టార్ రాబర్ట్ ప్యాటిన్సన్ ఎంపికయ్యారు. ‘ది బ్యాట్ మ్యాన్’, ‘ది ఒడిస్సీ’ వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్యాటిన్సన్.. ఈ ఐకానిక్ పాత్రనుపోషించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో గత కొన్ని నెలలుగా కొత్త బాండ్ ఎవరనే దానిపై సాగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికినట్లయింది.