ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతోంది. ప్రారంభ రౌండ్ల నుంచే అధికార ఎన్డీయే కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ విజయాల వైపు దూసుకెళ్తున్నారు. జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు 164 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, వైసీపీ కేవలం 14 స్థానాలకే పరిమితమైంది. అలాగే ఎంపీటీసీ స్థానాల్లోనూ కూటమి భారీ ఆధిక్యాన్ని నమోదు చేసింది. కూటమి అభ్యర్థులు 1,968 స్థానాల్లో ముందంజలో ఉండగా, వైసీపీ 99 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.