ఉత్తరప్రదేశ్లో ధంతేరస్ పండుగ రోజున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ట్రక్కు ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 17 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రాయ్పూర్ మథియాలో నిర్వహించిన ముండన్ కార్యక్రమం ముగించుకుని పెద్ద సంఖ్యలో ప్రజలు ట్రాక్టర్ ట్రాలీలో తిరిగి వస్తున్నారు. కొల్హాఘాట్ వంతెన సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది.