కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయంటూ ప్రజల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్ ఛార్జీలపై ప్రభుత్వం ఎట్టకేలకు తగ్గింపు నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఈ ధరను రూ. 4,000గా నిర్ణయిస్తే ఆర్టీసీకి రూ. 1,000, మెట్రోకి రూ. 3,000 లేదా రూ. 3,500 వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. డైలీ పాస్ ధరను కూడా తగ్గించారు. పాత ధర రూ. 400 ఉండగా కొత్త ధర ప్రకారం రూ. 325 చేశారు.