అగ్నిపథ్ పథకం సర్వీస్ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది. ఈ విషయాన్ని చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) ఇవాళ వెల్లడించారు. సాధారణంగా అగ్నివీర్లకు నాలుగేళ్ల సర్వీస్ కాలం ఉంటుంది. ఇది పూర్తయ్యాక వీరిలోని 25 శాతం మంది త్రివిధ దళాల శాశ్వత కేడర్‌కు ఎంపిక అవుతారు. అయితే ఎంపికవ్వని 75 శాతం మంది కోసం అగ్నిపథ్ సర్వీస్ కాలాన్ని కేంద్రం నాలుగేళ్ల నుంచి ఆరేళ్లకు పెంచింది. దీంతో ఆ 75 శాతం అగ్నివీర్లకు శాశ్వత కేడర్‌లో చేరేందుకు మరో అవకాశం దొరకనుంది