మురసు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఆకస్మిక వరదలు సంభవించే అవకాశముందని అంచనా వేశారు. వరదనీరు ఒక్కసారిగా ప్రవహించే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున వాగులు, వంకలు, చెరువుల పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వరంగల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఏకంగా 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం.

