loader

ప్రయాణికురాలు బస్సు నుంచి కిందకు నెట్టేయడంతో తీవ్రంగా గాయపడిన మహిళా కండక్టర్ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. గత నెల 25న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని మిట్టగూడెం వద్ద మణుగూరు డిపో కండక్టర్ ప్రవళిక(24)ను చిల్లర విషయంలో ఓ ప్రయాణికురాలు నెట్టివేయగా కిందపడ్డారు. బస్సు చక్రాల కింద పడి రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతినగా ఆమెను హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్యం మెరుగుపడుతుందని అంతా భావించినా… వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON