ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ విజయానికి 186 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. గుర్నూర్ సింగ్ మూడు వికెట్లతో రాణించగా, అన్షుల్ కాంబోజ్ రెండు వికెట్లు తీశాడు.