రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (TGERC) ఆమోదించిన ట్రూ-అప్ ఛార్జీల వసూలు ప్రక్రియ అమల్లోకి రావడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల్లో అదనపు మొత్తం కనిపించనుంది. ఈ ఛార్జీల రూపంలో నవంబర్‌లో యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసలు వసూలు చేయనున్నారు. ఈ లెక్కింపు ప్రస్తుత నెలలో వినియోగించిన విద్యుత్ యూనిట్ల ఆధారంగా కాకుండా, 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో సంబంధిత కనెక్షన్ వినియోగించిన విద్యుత్ ఆధారంగా జరుగుతుంది.