మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించిన ఓటర్ల సందడి మధ్యాహ్నం తర్వాత క్రమంగా తగ్గిపోయింది. ఉదయం ఉత్సాహంగా ఓటు వేసేందుకు తరలివచ్చిన ఓటర్లు, మధ్యాహ్నం సమయానికి పెద్దగా కనిపించలేదు. దీంతో పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు బోసిపోయినట్లు కనిపించాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని పిఠాపురం, గొల్లప్రోలు, సామర్లకోట, పెద్దాపురం, తుని ప్రాంతాల్లో పోలింగ్ కొంత మందకొడిగా సాగింది. ఉదయం సమయంలో ఓటర్ల రాకతో సందడిగా కనిపించిన కేంద్రాలు, మధ్యాహ్నం తర్వాత రద్దీ తగ్గడంతో వెలవెలబోయాయి.