ఇది ప్రకృతి వల్ల వచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకుని ఉంటే రాష్ట్రంలో కరువు పరిస్థితులు వచ్చేవి కావని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొండివైఖరి వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. శ్రీశైలం, కన్నెపల్లి పంప్‌హౌస్‌ల వద్ద పంపులు ఆన్ చేయకపోవడం వల్ల వానాకాలం పంటలకు నష్టం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. సుమారు 35 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు.