రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఆదిలాబాద్లో నిర్వహించిన బీఆర్ఎస్ రైతుగర్జన సభలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో రైతులకు రైతు బంధు బంద్ అయ్యింది. దిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం ఈఎంఐ ప్రతి నెలా పడుతోంది. అది కట్టకపోతే రేవంత్రెడ్డి పదవి రెన్యువల్ కాదు. భాజపా, కాంగ్రెస్ తోడుదొంగలు.. ఇద్దరూ కలిసే దోచుకుంటున్నారు. ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మోదీ అన్నారు’’ అని అన్నారు.