అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణారహితంగా దాడి చేసిన హేమంత్ పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీప్రాంతంలో నిందితుడు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు ఆరురౌండ్లు కాల్పులు జరిపినట్టు సమాచారం.