కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బోథ్ నియోజకవర్గంలోని తలమడుగు మండలంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నలుగురు రైతుల కుటుంబాలను ఆదివారం ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబాలకు పార్టీ తరఫున రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.
వీరిలో అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే వందకు పైగా ఘటనలు జరగడం బాధాకరమన్నారు.