మణిపూర్‌లోని నోనీ జిల్లాలో ప్రత్యర్థి సాయుధ బృందాల మధ్య జరిగిన కాల్పుల్లో కుకీ తెగకు చెందిన ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కెక్రూ నాగ గ్రామంలో శనివారం ఉదయం కాల్పులు మొదలయ్యాయి. అటవీ ప్రాంతంలోని కొండ గ్రామంలో కొన్ని గంటలపాటు కాల్పులు కొనసాగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను చురాచాంద్‌పూర్ జిల్లాలోని హెంగ్లెప్, థన్లాన్ మారుమూల ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసు అధికారి తెలిపారు. వారు ‘గ్రామ వాలంటీర్లు’ అని కుకీ పౌర సంఘాలు తెలిపాయని ఆయన పేర్కొన్నారు.