ప్రధాని కావాలనుకుంటే జీవితాంతం మాక్ పార్లమెంటులోనే ఉండిపోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సిక్కుల ఊచకోత జరిగిన రోజే రాంలీలా మైదానంలో సభ నిర్వహించడం.. బాధితుల పుండుమీద కారం చల్లినట్లేనని వ్యాఖ్యానించారు. చండీగఢ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా ఈమేరకు ప్రసంగించారు. అబద్ధాలు చెప్పడం, అరాచకాన్ని వ్యాప్తి చేయడం, పార్లమెంటును పనిచేయనివ్వకపోవడం.. ఇదే ప్రతిపక్షాల నిజ స్వరూపమని మండిపడ్డారు.

