ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర తుపాను ముప్పు ముంచుకొచ్చింది. బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన మురసు ఒంగోలు దిశగా వేగంగా కదులుతోంది. మరికొద్ది గంటల్లోనే తీరం దాటనుండటంతో ప్రకాశం, బాపట్ల, నెల్లూరు సహా పలు జిల్లాల్లో పెనుగాలులతో కూడిన అతిభారీ వర్షాలు దంచికొట్టనున్నాయి. మురసు తీవ్ర తుపాను ప్రస్తుతం నెల్లూరుకు కేవలం 80 కిలోమీటర్లు, కావలికి 90 కిలోమీటర్లు, ఒంగోలుకు 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని APSDMA వెల్లడించాయి.

