పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్ల నిరీక్షణ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 21న నగరంలో ప్రత్యేక పాస్‌పోర్ట్ మేళా నిర్వహించనున్నట్లు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి మాధవ్ తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ ద్వారా సాధారణ, తత్కాల్,పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అనే మూడు విభాగాలకు సంబంధించి దాదాపు 4,000 అపాయింట్‌మెంట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు నవంబర్ 3 నుంచి హైదరాబాద్ ఆర్‌పీఓ పరిధిలోని అన్ని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (పీఎస్‌కేలు), పీఓపీఎస్‌కేల పరిధిలోని దరఖాస్తుదారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు.