ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తుది లెక్కల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62.16 శాతం పోలింగ్ నమోదైంది. తిరుపతి నగరపాలికలో అతి తక్కువగా 46.85 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఒంగోలు నగరపాలికలో అత్యధికంగా 71.27 శాతం పోలింగ్ నమోదైంది. మచిలీపట్నంలో 70.83శాతం,ప్రకాశం జిల్లా చీమకుర్తి పురపాలికలో అతి ఎక్కువగా 84.36 శాతం, రాష్ట్రంలోనే అతిపెద్ద నగరపాలక సంస్థ విశాఖలో 56.32 శాతం పోలింగ్ నమోదైంది

