కాలుష్య ప్రభావిత నదీ ప్రాంతాల జాబితాను కేంద్రకాలుష్యనియంత్రణ మండలి) సవరించింది. తెలంగాణ రాష్ట్రంలోని నక్కవాగు, కిన్నెరసాని, కరకవాగు, మున్నేరు నదీ ప్రాంతాలను ఈ జాబితా నుంచి తొలగించింది. అయినప్పటికీ కృష్ణా, గోదావరి, మంజీరా, మూసీ నదులు ఇంకా కాలుష్య కోరల్లోనే ఉన్నాయి. వీటిలో ఆక్సిజన్ ప్రమాదకరంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అన్నిటి కంటే మంజీరాలో కాలుష్య ప్రభావం అధికంగా ఉంది. నదీ జలాల నాణ్యతను నిర్ణయించే కీలక ప్రమాణాల్లో ఒకటైన బీఓడీ(బయో ఆక్సిజన్ డిమాండ్) పరిమితి దాటుతోంది.

