పింఛన్ల పంపిణీలో టీడీపీ నేతలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు వైఎస్సార్సీపీ లేఖ రాసింది. పింఛన్ల పంపిణీ పేరుతో టీడీపీ నేతలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని, పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొంది. లబ్ధిదారులను అధికార పార్టీకి అనుకూలంగా ప్రభావితం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలి. పింఛన్ల పంపిణీ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే జరిగేలా ఆదేశాలు ఇవ్వాలి.