ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంకు మోసం కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ ఆయనతో పాటు ఇండ్ భారత్ పవర్ జెన్ కామ్ సంస్థ డైరెక్టర్లు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎఫ్ఐఆర్ను రద్దు చేసేందుకు నిరాకరించిన న్యాయస్థానం, ఈ కేసులో దర్యాప్తును కొనసాగించేందుకు మార్గం సుగమం చేసింది. సుమారు రూ.237 కోట్ల మేర బ్యాంకులకు మోసం చేయడం, నిధులను దారి మళ్లించడం వంటి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపడుతోంది.