కవాడిగూడలో ఉన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఆరో అంతస్తులోని మహిళా వాష్ రూమ్ కు వెళ్లిన మహిళా అధికారిణి, వాష్ బేసిన్ కింద అతికించి ఉన్న ఒక రహస్య మొబైల్ ఫోన్ గుర్తించి ఫోన్ ఎవరిదని విచారిస్తుండగా, అక్కడే ఉన్న ఫ్లోర్ అటెండెంట్ భరత్ వచ్చి ఫోన్ బలవంతంగా లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు. భద్రతా సిబ్బంది సాయంతో అతడిని అడ్డుకుని పట్టుకున్నారు. సిబ్బంది ఫోన్ పరిశిలుస్తుండగా భయాందోళనకు గురైన నిందితుడు ఆ ఫోన్ నేలకేసి కొట్టి ధ్వంసం చేశాడు.