రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు గతంలో బాహ్య శక్తుల నుంచి ఎదురయ్యేవని, ప్రస్తుతం రాజకీయ విధానాల నుంచే వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నేరాలు, రౌడీయిజంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేతలను ప్రజలు హర్షించరని స్పష్టం చేశారు. శాంతిభద్రతలు సరిగా లేని రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోవని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం, ప్రజలకు భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.