ఏడుగురు నేతల్ని సస్పెండ్ చేసిన టీడీపీ.. మహిళా నేతపై కూడా వేటు!
సీట్ల సర్దుబాటులో భాగంగా విజయవాడ కార్పొరేషన్‌లో టీడీపీలో సీట్ల కోసం ప్రయత్నించిన కొందరికి అవకాశం దక్కకపోవడంతో రెబల్స్‌గా మారారు.. ఇండిపెండెంట్లగా బరిలో నిలిచారు. రెబల్స్‌గా పోటీ చేస్తున్నవారిని టీడీపీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. కాకొల్లు మహేంద్ర నాథ్ (బాబీ), దేవరపు మాల్యాద్రి, గెడ్డం శ్రీనివాసరావు, కోట నారాయణ, చంద్రశేఖర్, కొమ్మినేని సురేష్, మాదాల సత్యవతిలను సస్పెండ్ చేశారు. కూటమి ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని.. తెలుగుదేశం పార్టీకి వీరికి ఎటువంటి […]

