చిత్తూరు జిల్లా గుబ్బిళ్లవారిపల్లె సమీపంలో కరెంట్ షాక్ తో ఓ మగ అడవి ఏనుగు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. పొలాల్లో వేలాడుతున్న హై టెన్షన్ విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగలడం వల్లే ఏనుగు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఏనుగు శరీరంపై మూడు చోట్లు కరెంట్ తీగలు తగిలిన గుర్తులు స్పష్టంగా కనిపించినట్లు పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.