దీపావళి పండుగకు ముందు దిల్లీలో నిర్వహించనున్న ఇండియా కూటమి ర్యాలీని వాయిదా వేయాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) విజ్ఞప్తి చేసింది. నవంబర్ 1న రాంలీలా మైదాన్‌లో జరగనున్న ఈ సభ వల్ల పండుగ సీజన్‌లో వ్యాపార కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలగవచ్చని ర్యాలీ కారణంగా సుమారు రూ.10 వేల కోట్ల వ్యాపారానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నవంబర్ 10 తర్వాత సభ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని కోరింది.