మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను తట్టుకోలేక ఎన్నికలను నిలిపివేసేందుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ పదేపదే న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సమరానికి అడ్డంకులు సృష్టిస్తూ దాదాపు 59కి పైగా పిటిషన్లు దాఖలు చేసి, కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రానికి అందకుండా కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసత్యాలను నిజాలుగా నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.