ఆదిలాబాద్ రిమ్స్ చికిత్స పొందుతూ ఏడు నెలల గర్భిణి మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యమే మహిళ మృతికి కారణమంటూ బంధువులు ఆరోపిస్తూ ఎంఐసీయూ వద్ద ఆందోళన చేపట్టారు. పాత ఉట్నూర్ కు చెందిన బోర్కరి సునీత (25) ఏడు నెలల గర్భిణి. ఈనెల 21న రిమ్స్ చేరింది. కాగా గత రాత్రి 12 గంటల సమయంలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆ విషయాన్ని అక్కడ ఉన్న వైద్యులకు చెబితే వారు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆమెకు సరైన చికిత్స అందించలేదని మృతురాలి బంధువులు పేర్కొన్నారు.