పూసపాటిరేగ మండలం వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బొత్స చైతన్యపై ఎన్నికల అధికారికి జనసేన ఫిర్యాదు చేసింది. UJK1667229 ఓటర్ ఐడీతో బొత్స చైతన్యకు విజయనగరం కార్పొరేషన్ పరిధిలో ఓటు హక్కు ఉన్నట్లు ఎన్నికల అధికారికి రేవతి వివరించారు. అక్టోబర్ 22వ తేదీ వరకు 41వ వార్డులో ఓటు హక్కు కలిగి ఉన్న వ్యక్తి.. పూసపాటిరేగ మండలం నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా ఎలా నామినేషన్ దాఖలు చేస్తారంటూ జనసేన అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు.