భారత టీ20 యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో శనివారం హాగ్లీ ఓవల్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టడం ద్వారా తిలక్ వర్మ ఈ ఘనత సాధించాడు. తిలక్ వర్మ ఏకంగా 30 ఇన్నింగ్స్‌ల్లో 26 క్యాచ్‌లు అందుకోగా ఇండోనేషియా ఆటగాడు డానిల్సన్ హవోయే పేరిట ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.