ఏపీలో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR)ను కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది. ఇవాళ ఎస్ఐఆర్ గడువును పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం తుది ఓటర్ల జాబితాల ప్రచురణ ఈ నెల 16న జరగాల్సి ఉండగా.. దీన్ని కాస్తా ఈ నెల 30వ తేదీకి పొడిగించారు. దీంతో ఓటర్ల నుంచి వ్యక్తమయ్యే అభ్యంతరాల పరిశీలన కోసం కూడా గడువు పెంచారు. ఈ గడువును ఈ నెల 22వ తేదీ వరకూ పొడిగించారు