కాక్రోచ్ జనతా పార్టీ’ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ ర్యాంకాల అరెస్టుపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ..కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిజెపి నేతల అరెస్టును పిరికిపంద చర్య అని దుయ్యబట్టారు. ఈ ఆందోళనలో పాల్గొంటున్న అన్ని పక్షాల లక్ష్యం ఒక్కటే కాబట్టి.. జంతర్ మంతర్ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని రాహుల్ ప్రతిజ్ఞ చేశారు. శాంతియుత నిరసనలో భాగంగా జంతర్ మంతర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించడం నేరం కాదు. అందుకు యువతను జైలుకు పంపడం పిరికిపంద చర్య.

