బెంగళూరు పబ్ వివాదంలో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (KADA) డైరెక్టర్గా పని చేస్తున్న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. అక్టోబర్ 14న ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఆయన బదిలీ అమల్లోకి వస్తుందని.. జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కడా డైరెక్టర్ ఇంఛార్జ్ బాధ్యతల విషయమై తగిన ఏర్పాట్లు చేయాలని చిత్తూరు కలెక్టర్కు ప్రభుత్వం సూచించింది