బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ,ఈ నెల 19వ తేదీ వరకు కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, తెలంగాణలోనూ నేటి నుంచి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.