తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వైద్య విశ్వవిద్యాలయాలు 2026-27 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి. అర్హత ఉన్న అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఇందుకోసం https://tspgmed.tsche.in వెబ్సైట్లో అవసరమైన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి.