ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో యువత చేపడుతున్న ఆందోళనలకు, నిరసనలకు బంగ్లాదేశ్ విద్యార్థి నేతృత్వంలోని జెన్-జెడ్ ఉద్యమమే స్ఫూర్తి అని బహిరంగంగా పేర్కొనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాను కూడా బంగ్లాదేశ్ జెన్-జెడ్ ఉద్యమాన్ని చూసి.. ప్రేరణ పొందానని తెలిపారు. బంగ్లాదేశ్ విద్యార్థి కార్యకర్తలను అభినందిస్తూ, ప్రజాస్వామ్య హక్కుల కోసం యువత సాగిస్తున్న సామూహిక పోరాటాలు సరిహద్దులు దాటి ఇతర దేశాల యువతకు కూడా దిశానిర్దేశం చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.