భాజపా సీనియర్ నేత వినోద్ ఆర్య కుమారుడు పులకిత్ ఆర్య రిసార్టులో రిసెప్షనిస్టుగా చేరిన నెల రోజులకే అదృశ్యమై కెనాల్లో విగతజీవిగా కనిపించిన అంకితా భండారీ మృతి కేసులో న్యాయం చేయాలంటూ అంకిత తల్లిదండ్రులు దిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిరసన తెలపగా, తెల్లవారుజామున పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నిరసనలకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మద్దతు తెలిపారు. భాజపా నేత దుష్యంత్కుమార్ గౌతమ్ సిక్కిం గవర్నర్ గా నియమించడమే ఈ నిరసనలకు కారణం.