విజయవాడలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కలిసి తమిళనాడు సిఎం విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఇద్దరు సిఎంలు మాట్లాడారు. పార్టీ పెట్టిన రెండేళ్లలోనే విజయ్ సిఎం అయ్యారని.. తమిళనాడు అభివృద్ధికి విజయ్ కృషి చేస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. అనంతరం విజయ్ మాట్లాడుతూ.. విజయవాడకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.