సీఎంఆర్ఎల్ లంచం కేసులో కేరళ మాజీ సిఎం పినరయి విజయన్తోపాటు మరి కొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో (విఎసిబి)ను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై తాత్కాలిక స్టే ఇవ్వడానికి కేరళ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణా టీ, ఆమె భర్త పి.ఏ మహమ్మద్ రియాస్, ఈ అప్పీల్ అనుమతి కోసం దరఖాస్తులు దాఖలు చేశారు.