రాష్ట్రంలోని మున్సిపాలిటీలను రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో నుంచి మున్సిపాలిటీల వాటా కింద రూ.296 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. స్థానిక సంస్థలకు అందాల్సిన గ్రాంట్లలో రాష్ట్ర వాటాను ప్రభుత్వం సమకూర్చింది. ఆ నిధులతో ప్రధానంగా పట్టణాల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం తొలగింపు, ఘన వ్యర్థాల నిర్వహణ, తాగునీటి సరఫరా వ్యవస్థల మెరుగుదల, లీకేజీల నివారణ, పాత మోటార్లు, పైప్లైన్ల మరమ్మతులు చేపట్టనున్నారు.