పంజాబ్ లోని మాన్సా ప్రాంతంలో ఫోర్స్’ అనే సంస్థ ద్వారా డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రముఖ కార్యకర్త పర్వీందర్ సింగ్ ఝెటా మంగళవారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. ఈ క్రమం లోనే నిషేధిత ఔషధాలు, డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో ఓ మెడికల్ స్టోర్ యజమానితో ఆయనకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వివాదం ముదరడంతో సదరు కెమిస్ట్షాపు యజమాని అతి సమీపం నుంచి పర్విందర్ సింగ్పై కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

